Chulbuli Chulbuli - Karthik

Chulbuli Chulbuli

Karthik

00:00

04:23

Similar recommendations

Lyric

హే ఛుల్బులి నా ఛుల్బులి నువు కోహినూరు లాంటి కొండమల్లి

నా ఛుల్బులి నా ఛుల్బులి అందాల దాడి చేసినావే ఆడపులి హాయ్

మాటల్లో మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ

చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ

నువు దొరికిపోవే నా దరికిరావే నీ ఇంటిపేరు మార్చాలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి

ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి

పిట్టంత నడుమును ఎరవేశావే పిల్లోడి నిదరను ఎగరేశావే

ఆకలి కళ్ల పోకిరిలాగ వదలక వెంట తిరిగావే

నాజూకు ఈటెలు గురిచూశావే నేనెటూ కదలని గిరిగీస్తావే

కుదురంతా చెరిపేశావే చూపులతోన చెక్కిలిమీటి చెకుముకి మంటేశావే

కనుసైగలతోనే కవ్వించావే చెలీ నన్ను రారమ్మనీ

మాటల్లో మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ

చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ

హే నువు దొరికిపోవే నా దరికిరావే నీ ఇంటిపేరు మార్చాలి లాలీ చలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి

ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి

బాగ్దాద్ గజదొంగై నే రానా ఏకంగా నిన్నే దోచుకుపోనా

కనుగొనలేని చిలకల దీవి మలుపులలోన నేనున్నా

ఏడేడు సంద్రాలను దాటైనా ఎలాగో నీ సరసకు రాలేనా

వింటున్నా చూస్తూ వున్నా నీ పదునైన మాటలలోని తెగువకు పడిపోతున్నా

హే ఎన్నటికైన నువు నాకు కూనా రానా రానా జతైపోనా

మాటల్లో మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మళ్లీ మళ్లీ

చూడాలి నీ అల్లిబిల్లి ఓ ఓ

నువు దొరికిపోవే నా దరికిరావే నీ ఇంటిపేరు మార్చాలి

ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి

ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి

సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, దూకుడు, ఎస్.ఎస్.థమన్

- It's already the end -