00:00
03:13
నాకెంతో నచ్చిందే
నీలాగా ఉన్న నీడ కూడా
నా వెంట వచ్చిందే
ఏ చోట నన్ను వీడకుండా
నీ నవ్వు జల్లు నాపై రాలే పువ్వుల్లా
నే వెళ్లే దారి ముస్తాబయ్యేలా
నా ఊహ రివ్వుమంటూ ఎగిరే గువ్వల
నీవైపే సాగేగా
ఓ పిల్లా నీ వల్లా నే మళ్ళి మళ్ళి పుడ్తున్నానే
క్షణమొక జన్మగా
నీ కళ్ళ వాకిళ్ళ చినుకల్లే జారీ దూరం అయినా
నిమిశమే తలవగా
♪
ఒక చూపు
ఒక మాట
ఒకే అడుగులై ఎలా కలిసెను
నువ్వే చేరగా ఏదో వరంలా జతగా తిరిగిన రోజులో
నీ జ్ఞాపకం మనసు తాకితే
రంగులనెన్నో చల్లేనంట కాలం
ఏలా నిన్ను కసిరినదో హృదయమే
ఓ పిల్లా నీ వల్లా నే మళ్ళి మళ్ళి పుడ్తున్నానే
క్షణమొక జన్మగా
నీ కళ్ళ వాకిళ్ళ చినుకల్లే జారీ దూరం అయినా
నిమిశమే తలవగా
♪
చిగురాస విసిరేసా నువ్వే నేనని నిజం తెలియకా
కలే కాదని కలతనిదురను వెతికేస్తున్న వెలుగులో
ఆకాశమే లేని నేలని
ఓ వింతగా చూసినంట లోకం గాలై నిన్ను చుట్టేయన ఉదయమే
ఓ పిల్లా నీ వల్లా నే మళ్ళి మళ్ళి పుడ్తున్నానే
క్షణమొక జన్మగా
నీ కళ్ళ వాకిళ్ళ చినుకల్లే జారీ దూరం అయినా
నిమిశమే తలవగా